• 6 years ago
Villagers in Na Cheuak Yai in north-eastern Thailand’s Nakhon Phanom province are taking these unusual measures while they fear caused five men lost life.

దెయ్యాల భయంతో అప్పట్లో 'ఓ స్త్రీ రేపురా' అన్న ప్రచారం బాగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు తమ ఇళ్లకు సైతం ఇవే బోర్డులను తగిలించుకున్నారు. ఇప్పుడిలాంటి పరిస్థితే థాయిలాండ్ లోని 'న చియూక్ యాయ్' గ్రామస్తులకూ ఎదురైంది. ఇటీవల గ్రామంలోని ఐదుగురు పురుషులు మృత్యువాత పడటంతో.. ఈ మరణాలకు దెయ్యమే కారణమన్న ప్రచారం జరిగింది. దీంతో దెయ్యాల నుంచి రక్షించుకోవడానికి కనీవిని ఎరుగని ఓ కొత్త విధానాన్ని ఫాలో అయిపోతున్నారు.
న చియూక్ యాయ్' గ్రామంలో కొన్నాళ్ల క్రితం ఓ భర్త లేని మహిళ మృతి చెందింది. అప్పటినుంచి ఆమె గ్రామంలోని పురుషులను పట్టి పీడిస్తోందన్న ప్రచారం మొదలైంది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న పురుషుల శరీరాల్లోకి ప్రవేశించి.. నిద్రలోనే వారిని చంపేస్తోందన్న గుసగుసలు మొదలయ్యాయి.
దెయ్యం బారి నుంచి తమ ఇంటి మగవాళ్లను రక్షించుకునేందుకు ఇప్పుడక్కడ దిష్టిబొమ్మల తంతు మొదలైంది. అయితే అవి సాదాసీదా దిష్టిబొమ్మలైతే ఇంత చర్చ ఉండేది కాదు. పెద్ద పురుషాంగాల్ని కలిగిన దిష్టిబొమ్మల్ని తమ ఇంటి ముందు ఉంచుతున్నారు.
పెద్ద పురుషాంగాలను కలిగిన పురుషులను చూస్తే దెయ్యం భయపడుతుందని.. అందుకే ఇలాంటి దిష్టిబొమ్మలను ఇంటి ముందు పెడుతున్నామని అక్కడివారు చెబుతున్నారు.
కేవలం 90మంది మాత్రమే ఉండే ఈ గ్రామంలో.. రాత్రయిందంటే చాలు పురుషులను భయం వెంటాడుతుందట. దెయ్యాల బారి నుంచి రక్షించుకోవడానికి రాత్రవగానే.. నైటీలు వేసుకుని, లిప్ స్టిక్స్ పెట్టుకుని అచ్చు ఆడవాళ్లలా తయారవుతారట. ఆడవాళ్లలా కనిపిస్తే దెయ్యాలు తమ దరిచేరవని అక్కడివారు భావిస్తున్నారు.

Category

🗞
News

Recommended