నేడు జీహెచ్​ఎంసీ కౌన్సిల్ సమావేశం - మేయర్​పై అవిశ్వాస తీర్మానం యోచనలో బీఆర్​ఎస్!​

  • last month
GHMC Council Meeting : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదో కౌన్సిల్ సమావేశం నేడు జరగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఈ సమావేశంలో అధికార, విపక్ష కార్పొరేటర్ల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్, మరికొంత మంది కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో ఈసారి కౌన్సిల్ భేటీ రసవత్తరంగా మారనుంది. బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాల కోసం పట్టుబట్టాలని గ్రేటర్ హైదరాబాద్ బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు.

Recommended