రేపే టీజీ కేబినెట్ విస్తరణ - మరో ఆరుగురికి ఛాన్స్

  • 6 days ago
Telangana Cabinet Expansion 2024 : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తైంది. ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చినట్లైతే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం దిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం ఆమోదిస్తే మంత్రివర్గ విస్తరణపై రాత్రికే నిర్ణయం ప్రకటించి, గురువారం ప్రమాణస్వీకారం చేయించే అవకాశం ఉంది. ఈ విస్తరణలో నలుగురికి మంత్రి పదవులు, ఒకరికి డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి.