• 6 years ago
Adithya Birla Group Chairman Kumara Mangala Birla met Chief Minister Designated of Andhra Pradesh YS Jagan Mohan Reddy at AP Bhavan in New Delhi, when He was in Delhi tour. Kumara Mangalam Birla greets to YS Jagan for his Landslide Victory in Assembly and Lok Sabha Elections in Andhra Pradesh. He gave assurance to YS Jagan to invest in AP in various sectors upcoming years.
#andhrapradesh
#ysjagan
#apbhavan
#delhi
#ycp
#sardhesai
#AdithyaBirla
#KumaraMangalaBirla

దేశ పారిశ్రామిక దిగ్గ‌జం, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ‌ల ఛైర్మ‌న్ కుమార మంగళం బిర్లా రాష్ట్రానికి కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 26వ తేదీన వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కుమార మంగ‌ళం బిర్లా ఆయ‌న‌ను క‌లిశారు. వైఎస్ జ‌గ‌న్‌ను క‌లుసుకోవ‌డానికి ఆయ‌న స్వ‌యంగా ఏపీ భ‌వ‌న్‌కు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో బిర్లా వెంట.. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ ఉన్నారు. ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్య‌త లేద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి గ‌ల అవ‌కాశాల గురించి ఆయ‌న వైఎస్ జ‌గ‌న్‌ను అడిగి తెలుసుకున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏఏ జిల్లాల్లో ఎలాంటి అవ‌కాశాలు ఉన్నాయ‌నే విష‌యం ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ- రాష్ట్రంలో వెనుక‌బ‌డిన జిల్లాల్లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని సూచించిన‌ట్లు తెలిసింది. దీనివ‌ల్ల రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీక‌ర‌ణ ఏర్ప‌డుతుంద‌ని, అన్ని జిల్లాలు స‌మానంగా అభివృద్ధి చెందుతాయ‌ని వైఎస్ జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డిన‌ట్లు చెబుతున్నారు.

Category

🗞
News

Recommended