• 7 years ago
Ajay Bhupathi, a student of Ram Gopal Varma is making his directorial debut with RX 100 movie which released on July 12th. Starring Karthikeya and Payal, the film is an intense love story. Teasers, Trailers created lot of buzz in the industry. Before its release, high expectations in audience. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
శివ (కార్తికేయ) తల్లిదండ్రుల లేని అనాథ. డాడీ (సింధూరపువ్వు రాంకీ) సంరక్షణలోపెరిగి పెద్దవుతాడు. డాడీ గ్రూప్‌లో కీలక సభ్యుడిగా ఉంటాడు. గ్రామ జెడ్పీటీసీ విశ్వనాథం ( రావు రమేష్)కు అండగా ఉంటారు. హుషారుగా, అమాయకంగా ఉండే శివను విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్‌పుత్) ప్రేమలోకి దింపుతుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శివ ఆమె ప్రపంచంగా జీవిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది.
ఇందూకు పెళ్లి అయిందని తెలిసినా ఆమె జ్హాపకాల్లోనే ఎందుకు బతికాడు? ఇందు కోసం మూడేళ్లు ఎదురు చూసిన శివకు ఆమె ప్రేమ దక్కిందా? ఇష్టంగా ప్రేమించిన శివను ఇందు ఎందుకు దూరం చేసుకొన్నది? చివర్లో ఊహించని విధంగా ఇందు గురించి శివ ఓ విషయాన్ని తెలుసుకొంటుంది. ఆ ట్విస్టు వల్ల సినిమా క్లైమాక్స్‌ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే RX 100 చిత్ర కథ.
శివ దూకుడు తనంతో ఉండే క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడంతో ఆర్ఎక్స్ 100 చిత్ర కథ మొదలవుతుంది. శివ ఆవేశాన్ని డాడీ కంట్రోల్ చేయడం, అలాగే విశ్వనాథం ఎన్నికల్లో గెలుపొందడం లాంటి అంశాలను పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి చక్కగా ఉపయోగించుకొన్నాడు. చాలా సౌమ్యంగా ఉండే శివ అగ్రెసివ్‌గా మారడానికి గల కారణాలను ఫ్యాష్ బ్యాక్‌తో మొదలుపెడుతాడు. ఇందు ఎంట్రీతో తొలిభాగం నాటు రొమాన్స్‌తో వేడెక్కుతుంది. యూత్‌లో జోష్ పెంచే విధంగా లిప్‌లాక్‌లతో సన్నివేశాల్లో కాకపుడుతుంది. ఇలా సాగుతున్న సినిమాకు ఓ మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

Recommended