• 7 years ago
మరాఠీ చిత్రం సైరత్ పంజాబీ రీమేక్‌తో సినీ ఇండ్రీస్టీలోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ మంచి గ్లామర్ తారగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆర్జీవి శిష్యుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న RX 100 చిత్రంలో కొత్త హీరో కార్తీకేయకు జంటగా ఆమె నటిస్తున్నారు. RX 100 చిత్రం టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. రిలీజ్‌కు ముందే పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం జూలై 12న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో పాయల్ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. పాయల్ రాజ్‌పుత్ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..
నా పేరు పాయల్ రాజ్‌పుత్. పంజాబీ సినిమాల్లో, టెలివిజన్ సీరియల్స్‌లో ఇప్పటి వరకు నటించాను. మరాఠీలో ఘనవిజయం సాధించిన సైరత్ చిత్రం పంజాబీ రీమేక్‌లో నటించాను. ఆ చిత్రంలో నా నటనకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. RX 100 చిత్రంతో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది.

Ajay Bhupathi, a student of Ram Gopal Varma is making his directorial debut with RX 100 which is releasing on July 12th. Starring Karthikeya and Payal, the film is an intense love story. In occassion, Heroine Payal Rajput speaks to Telugu Filmibeat exclusively.

Recommended