• 7 years ago
Amy Jackson is living the life as she's holidaying in a Greek island along with her friend Kimberley Garner and the pictures look way.

ఇండియన్ సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్న బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ షూటింగులకు కాస్త గ్యాప్ దొరకడంతో తన బాయ్ ఫ్రెండ్ కింబర్లీ గార్నర్‌ దగ్గర వాలిపోయింది. ప్రస్తుతం ఈ జంట గ్రీస్ సమీపంలోని మైకోనోస్ అనే ఐలాండ్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ జలకాలాడుతున్న ఫోటోలు మీడియాలో హైలెట్ అయ్యాయి. బికినీలో అమీ జాక్సన్ చేస్తున్న విన్యాసాలు చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
అమీ జాక్సన్, కింబర్లీ గార్నర్ మైకోనోస్ దీవిలో ఏ రేంజిలో ఎంజాయ్ చేస్తున్నారో ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతోంది. గతంలో ఈ ఇద్దరూ సూపర్ గర్ల్ సిరీస్‌లో కలిసి నటించారు.
2018లో ప్రారంభం అయినప్పటి నుండి అమీ జాక్సన్ ఎంజాయ్మెంట్ మూమెంట్‌లోనే కనిపిస్తోంది. గడిచిన ఆరు నెలల్లో నెలకు కనీసం ఒక వెకేషన్ అయినా వెళుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేస్తూ అభిమానులను ఎంటర్టెన్ చేస్తోంది.
అమీ జాక్సన్ కొన్ని రోజుల క్రితమే మోరాకో, ఇటలీ, యూనైటెడ్ స్టేట్స్‌లో పర్యటించింది. ఇపుడు మైకోనోస్ దీవిలో దర్శనమిచ్చింది. నెక్ట్స్ హాలిడే ఎక్కడికి వెళుతుందో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Recommended