• 7 years ago
Ranbir Kapoor turns dacoit for YRF's next. The 35-year-old actor is all set to stun the audience with his never-seen-before avatar in Karan Malhotra's Shamshera. Talking about the movie, Ranbir Kapoor says, "Shamshera is exactly the film I was looking for. While growing up watching Hindi commercial cinema, I had an image of what a film hero should be doing. Shamshera allows me to do everything that I had imagined and it's a very exciting project for me. Karan is going to take me completely out of my comfort zone and I'm looking forward to this challenge."
#RanbirKapoor
#Shamshera
#karanmalhotra


బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ మనకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోగానే తెలుసు. అయితే కేవలం అదే ఇమేజ్‌కు పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు తనను తాను సరికొత్తగా పరిచయం చేసకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్ 'సంజు'లో నటిస్తున్న రణబీర్ దీని తర్వాత 'షంషీరా' అనే యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ‘షంషీరా' చిత్రంలో రణబీర్ కపూర్ బందిపోటుగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ‘అగ్నిపథ్', ‘బ్రదర్స్' ఫేం కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.
ఈ సినిమా గురించి రణబీర్ కపూర్ మాట్లాడుతూ... ‘షంషీరా లాంటి సినిమా కోసం నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. చిన్నతనం నుండి హిందీలో ఎన్నో కమర్షియల్ సినిమాలు చూస్తూ పెరిగా.... అలాంటి సినిమాల్లో చేయాలని ఎప్పటి నుండో కోరిక ఉండేది. ఇన్నాళ్లకు షంషీరా సినిమా ద్వారా నా కోరిక తీరబోతోంది. ఈ సినిమాను ఒక ఛాంలెజింగ్‌గా తీసుకుని చేస్తున్నాను. దర్శకుడు కరణ్ ఈ సినిమా ద్వారా నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయబోతున్నారు' అని రణబీర్ కపూర్ తెలిపారు.
దాదాపు 9 ఏళ్ల తర్వాత యశ్ రాజ్ ఫిలింస్‌తో కలిసి మసాలా ఎంటర్టెన్మెంటుతో కూడిన దేశీ మెగా యాక్షన్ మూవీ ‘షంషీరా' చేస్తున్నారు.

Recommended