Tej I Love U Movie Review

  • 6 years ago
Supreme Hero Sai Dharam Tej's latest film with Anupama Parameswaran as heroine is 'Tej' with caption 'I Love U'. A.Karunakaran is Directing this film while Creative Producer K.S.Rama Rao, Vallabha are bankrolling this film under Creative Commercials Movie Makers. 'Tej' is another romantic entertainer from Director A.Karunakaran who earlier delivered Superhit Romantic Movies like 'Tholi Prema', 'Ullasamga Utsahamga', 'Darling'. 'Tej I Love U' is being made as a breezy love story which is filled with feel good moments throughout the film.

టాలీవుడ్‌లో మెగా మేనల్లుడిగా సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కెరీర్ ఆరంభించి వరుస విజయాలతో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే ఇటీవల కాలంలో తేజ్‌కు విన్నర్, ఇంటిలిజెంట్ చిత్రాలు నిరాశను కలిగించాయి. దాంతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తొలిప్రేమ దర్శకుడు కరుణాకరన్ డైరెక్షన్‌లో, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌‌తో జతకట్టి తేజ్ ఐ లవ్ యూ చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు తేజ్ సిద్ధమయ్యారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జూలై 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి ధరమ్ తేజ్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలుసుకోవడానికి తేజ్ ఐ లవ్ యూ చిత్ర కథలోకి వెళ్లాల్సిందే.
తేజ్ (సాయిధరమ్ తేజ్) తన స్నేహితులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ నడుపుతుంటాడు. చిన్నతనంలో ఓ కారణంగా జైలుశిక్ష అనుభవిస్తాడు. పెదనాన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి ఫ్యామిలీకి దూరమవుతాడు. ఈ క్రమంలో నందిని (అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడుతాడు. కానీ తేజ్‌ను వెతుక్కుంటూ నందిని లండన్‌ నుంచి ఇండియాకు వస్తుంది. తేజ్‌ పరిచయం ప్రేమగా మారుతుంది. తేజ్, నందిని ఇద్దరు తమ ప్రేమను వ్యక్తపరుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో నందిని యాక్సిడెంట్‌కు గురై గతాన్ని మరిచిపోతుంది.
తేజ్ ఎందుకు జైలుశిక్ష అనుభవించాడు? తేజ్ ఫ్యామిలికి ఎందుకు దూరమయ్యాడు? తేజ్‌ను ఎందుకు వెతుక్కొంటూ వచ్చింది? గతాన్ని మరిచిపోయిన నందినికి తేజ్ తన ప్రేమను వ్యక్తపరిచేందుకు ఏం చేశాడు? మరిచిపోయిన గతాన్ని నందిని గుర్తు తెచ్చుకొందా? చివరకు నందిని, తేజ్ ఒక్కటయ్యేందుకు ఎలాంటి అడ్డంకులను అధిగమించారు అనే ప్రశ్నలకు సమాధానమే తేజ్ ఐ లవ్ యూ చిత్రం కథ.

Recommended