• 6 years ago
For 6 months You & Do Emotional Atyachar on Me, My Fans, Suppoters, Friends, Party Cadre, Janasainks, Film Industry and as Cherry on the Top, You Abuse my Old Mother too.. You Sick minded degenerates and Now you send me feelers to apologise, privately!!.

ఓ పార్టీకి మద్దతుగా ఉంటుందంటూ కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం కూడా తన ట్వీట్ల యుద్ధాన్ని కొనసాగించారు. అంతేకాదు, తమను ఆరు నెలలుగా బహిరంగంగా తిడుతున్న వారు ప్రయివేటుగా క్షమాపణలు చెబుతున్నారని, ఇలాంటివి తన వద్ద కుదరదన్నారు.
సోమవారం ఉదయం నుంచి ట్వీట్లు ప్రారంభించారు. తన తల్లిని దూషించిన వారు రహస్యంగా క్షమాపణలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్‌లో నోటికొచ్చినట్లు తిట్టారని, ప్రయివేటుగా క్షమాపణలు చెబుతున్నారని, ఇలాంటివి తన దగ్గర కుదరవని తేల్చి చెప్పారు. గత ఆరు నెలలుగా తనను, తన తల్లిని, అభిమానులను, అనుచరులను నోటికొచ్చినట్లు తిట్టారన్నారు. ఇంతటి నీచ బుద్ధి ఉన్న మీరు ఇప్పుడు రహస్యంగా క్షమాపణలు చెప్తారా? అని మండిపడ్డారు.
మనలను, మన తల్లులను, ఆడపడుచులన్ని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలని, వాళ్ల టీవీలు ఎందుకు చూడాలని, జర్నలిజం విలువలతో ఉన్న ఛానెల్స్‌, పత్రికలకు మద్దతిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోందన్నారు. వీరికి జనసేన 'వీరమహిళ' విభాగం అండగా ఉంటుందన్నారు.

Recommended