• 7 years ago
The Cyberabad police seem to have achieved a breakthrough in cracking the mystery behind of a pregnant woman case found in Botanical garden at Kondapur during the last week of January.

గచ్చిబౌలిలో ఎనిమిది నెలల గర్భిణిని ముక్కలుముక్కలుగా చేసి గోనెసంచుల్లో కుక్కి పడేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత నెల 30న వెలుగుచూసిన ఈ హత్యకు సంబంధించి పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సీసీటీవి ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. బైక్‌పై వచ్చిన ఓ జంట ఆ శవాన్ని అక్కడ పడేసి వెళ్లినట్టు గుర్తించారు.
అర్థరాత్రి సమయంలో ఓ మహిళతో పాటు యమహా బైక్‌పై వచ్చిన వ్యక్తి.. మొదట బొటానికల్‌ గార్డెన్‌ పరిసరాల్లో రెండు రౌండ్లు కొట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఎవరైనా చూస్తున్నారా?.. లేదా? అన్న విషయాన్ని నిర్దారించుకున్న తర్వాత.. వారిద్దరి మధ్య ఉన్న ఒక మూటను రోడ్డు పక్కన పడేసి వెళ్లారు.
రోడ్డుపై ఆ మూటను పడేసి వెళ్లిన తర్వాత.. అది గమనించిన ఓ దుకాణం యజమాని దాన్ని తీసుకెళ్లి 20మీటర్ల దూరంలో పడేశాడు. ఆపై బల్దియా సిబ్బంది కొంతమంది దాన్ని గుర్తించి మూటను విప్పి చూశారు. అందులో యువతి శవాన్ని ముక్కలు ముక్కలు చేసి పడేసినట్టు గుర్తించారు.
మూటను అక్కడ పడేసిన తర్వాత నిందితులు ఎటువైపు వెళ్లారనే విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. బొటానికల్ గార్డెన్ పరిసర ప్రాంతాల నుంచి వైట్‌ఫీల్డ్స్‌ జంక్షన్‌ మీదుగా అంజయ్య నగర్‌, సిద్ధిఖ్‌నగర్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని సీసీటీవి ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు

Category

🗞
News

Recommended