• 7 years ago
US president Ivanka Trump will be presented Siddipet Gollabhama saree in her Hyderabad tour, which has been selected by Tollywood heroine Samantha

అమెరికా అధ్యక్షుడు డోనాల్ద్ ట్రంప్ కూతురు ఇవాంకకు తెలంగాణ చేనేత కార్మికుల ప్రతిభ తెలిసి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు వస్తున్న ఇవాంకకు సిద్దిపేట కానుక అందనుంది. సిద్దిపేటలో ప్రత్యేకంగా తయారయ్యే అందమైన గొల్లభామ చేనేత చీరలు ఇవాంకకు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం ఆమెకు అందించే కానుకల జాబితాలో గొల్లభామ చీర చేర్చనున్నట్లు తెలుస్తోంది.
సిద్దిపేట ప్రాంతంలో 50ఏళ్ల నుంచి వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. పేటెంట్‌ హక్కులు కూడా సిద్దిపేటకు దక్కాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ చీరల తయారీని ప్రోత్సహిస్తున్నారు. వీటిని ప్రాచుర్యంలో తేవడానికి కృషి చేస్తున్నారు.



Category

🗞
News

Recommended