2019 జూలై 9. సగటు భారతీయ అభిమాని మర్చిపోలేని రోజు అది. ఇంచు తేడాలో వరల్డ్ కప్పు కల చేజారిపోయింది. అప్పటి సాగిన అద్భుతమైన ప్రయాణం ముగిసిపోయింది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ తో భారత్ మ్యాచ్. వర్షం కారణంగా పక్క రోజుకు మారింది షెడ్యూల్. న్యూజిలాండ్ విసిరిన 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించటానికి భారత టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. కొహ్లీ, రోహిత్ లాంటి మహామహులు అంతా నిష్క్రిమించిన చోట జడేజా తోడుగా వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. బుల్లెట్లలా దూసుకువస్తున్న కివీస్ బౌలర్ల బంతులను అడ్డుకుంటూ అచేతనంగా నిలబడిపోయాడు. క్రీజులో కుదురుకునేందుకు చాలా సమయం పట్టింది. జడేజా 77 పరుగులు చేస్తే...ధోని 50 పరుగులు చేశాడు. ఇక గేర్లు మార్చాల్సిన సమయంలో మార్టిన్ గప్తిల్ మన కలల్ని ఆశల్ని చిదిమేశాడు. కెరీర్ ను రనౌట్ తో ప్రారంభించిన ధోని..వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తే ధోని ఆ రోజు రనౌట్ అయ్యాడు. ఇంచు తేడాతో అంతా జరిగిపోయింది. 240 పరుగులు కొట్టాల్సిన భారత్ 221 పరుగులకే పరిమితమైపోయింది. టీమిండియా వరల్డ్ కప్ ల చేజారిపోయింది. అప్పటికప్పుడు ప్రకటించకపోయినా ఏడాది తర్వాత తన ఆఖరి మ్యాచ్ అప్పుడే ఆడేశానంటూ ధోని న్యూజిలాండ్ మ్యాచ్ ఫోటోతో రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. టీమిండియాకు రెండు ఐసీసీ వరల్డ్ కప్పులను, నెంబర్ స్థానాన్ని అందించిన ధోని కథకు సరైన ముగింపు లేకుండా ముగిసిపోయింది. ఆ పగ నేటికి ఆరేళ్లైనా అలానే ఉంది. మళ్లీ ఐసీసీ టోర్నీ నాకౌట్ స్టేజ్ లో కివీస్ మనకు చిక్కింది ఈ రోజే. ఇవాళ ఫైనల్లో ను న్యూజిలాండ్ ను చిత్తు చేసి ఆరేళ్ల క్రితం నాటి పగను తీర్చుకోవాలని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చూడాలి మనోళ్లంతా కలిసి ధోని కథకు విక్టరీతో క్లైమాక్స్ ఇస్తారేమో.
Category
🗞
News