• yesterday
  తిరుపతిలో ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ మృతి చెందాడు. క్యాన్సర్ తో పోరాడుతూ దేవర సినిమా చూడాలని ఉందని కార్తీక్ చెబుతున్నాడంటూ ఆమె తల్లి పెట్టిన ప్రెస్ మీట్ వైరల్ గా మారింది. దీంతో స్పందించిన ఎన్టీఆర్ కార్తీక్ కి గతంలో వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పటంతో పాటు వైద్య ఖర్చులు అన్నీ తనే భరిస్తానని తారక్ మాటిచ్చారు. కౌశిక్ తండ్రి టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగి కావటంతో వాళ్లూ కౌశిక్ కుటుంబానికి కాస్త ఆర్థిక సాయం చేశారు. ఎన్టీఆర్ అందించిన సాయంతో క్యాన్సర్ మహమ్మారి నుంచి కోలుకుని బయటపడిన కౌశిక్ మళ్లీ ఉన్నట్లండి ఆరోగ్యం క్షీణించి కన్నుమూయటంతో తన తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎన్టీఆర్ సాయంతో పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చాడని కానీ ఉన్నపళంగా మంచం పట్టి ఇలా తమను వదిలేసి వెళ్లిపోయాడంటూ ఆ తల్లి తండ్రులు పడుతున్న ఆ వేదన స్థానికులు  అందరినీ కంట తడి పెట్టిస్తోంది. స్నేహితులు చాలా మంది కౌశిక్ అంతిమయాత్ర కోసం తరలివచ్చారు. 

Category

🗞
News

Recommended