• yesterday
కర్ణాటకలో అసలేం జరుగుతుంది. యాక్టర్స్ పై పొలిటీషియన్స్ ఎందుకు అంతలా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా రష్మిక మందన్న. ఆ కాంట్రవర్సీ గురించైతే ఇక చెప్పనక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుండి ఆమె తన సొంత రాష్ట్రం నుండే నెగిటివిటీని అందుకుంటుంది. అసలేంటి గొడవ. కర్ణాట రాష్ట్రంలో ప్రభుత్వానికి నటులకు మధ్య ఎం జరుగుతుంది ? ఆ గొడవేంటో డిటైల్ గా ఈ వీడియోలో చూదాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకూ చూడండి.  మార్చ్ 1 నుండి 8 వారికి 16th బెంగళూర్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఈ ఈవెంట్ లో సినీ ప్రముఖులు రాకపోవడంపై ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఘాట్ వ్యాఖ్యలు చేసారు. బెంగళూరు ఫిలిం ఫెస్టివల్ ఇనాగ్రేషన్ ఈవెంట్ లో కేవలం 10 మంది ప్రముఖులు మాత్రమే ఉన్నారు. ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్ కాదు. ఇండస్ట్రీకి సంబందించిన ఈవెంట్. యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ రాకపోతే ఇంకెవరు వస్తారు అని కామెంట్స్ చేసారు. అక్కడ వరకి బానే ఉంది. కానీ ఆ తర్వాత అయిన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక్కడే ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కన్నడ చిత్ర పరిశ్రమ, మాకు మద్దతు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. గవర్నమెంట్ సపోర్ట్ అండ్ పర్మిషన్స్ ఇవ్వకపోతే సినిమాలని ప్రొడ్యూస్ చేయలేరు. ఎతీరు మారకపోతే ఎక్కడ నట్లు బిగించాలో, ఎవరిని కాంటాక్ట్ చేయాలో కూడా నాకు కూడా తెలుసు. అది గుర్తుంచుకోండి అని అన్నారు. ఇక అక్కడ నుండి మొదలయ్యింది. అయిన చేసిన కామెంట్స్ నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అయ్యాయి. బీజేపీ ఎంపీ యాక్టర్ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. "ఎవరైనా స్క్రూలు బిగించడానికి ప్రయత్నిస్తే, దేవుడు మనల్ని రక్షిస్తాడు" అని కంగనా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కంగనా కామెంట్స్ ని బట్టి చూస్తే ఆమె ఇన్ డైరెక్ట్ గా రశ్మికకి సపోర్ట్ చేసారనే చెపొచ్చు. శివకుమార్ కామెంట్స్ ని ప్రతిపక్ష నేతలు కూడా వ్యతిరేకించారు. సినీ ఇండస్ట్రీని మీరు బద్దరిస్తున్నారని బీజేపీకి చెందిన ఆర్. అశోక ఆరోపించారు. శివకుమార్ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారనుకోండి. 

Category

🗞
News

Recommended