• 4 hours ago
SLBC TUNNEL ACCIDENT UPDATE : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడను కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఎన్‌జీఆర్‌ఐ, జియెలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ ఇచ్చిన సర్వే రిపోర్ట్‌ ఆధారంగా వారు గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో సొరంగ మార్గంలో ఉన్న మట్టి, రాళ్లు, ఇతర లోహాలకు భిన్నంగా సుమారు 3 నుంచి 5 మీటర్ల లోపల మెత్తని పొరలు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాలలో తవ్వితే కానీ అవి ఏంటో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. కానీ నీరు అధికంగా ఊరుతుండటంతో నిపుణులు సూచించిన లోతు వరకు మట్టిని తోడలేకపోతున్నారు. ఇదే సహాయ బృందాలకు ప్రధాన ఆటంకంగా మారింది. ఇవాళ లేదా రేపు సాయంత్రానికి సొరంగంలో జీపీఆర్‌ సర్వే ద్వారా గుర్తించిన ఆ ప్రాంతాల్లో ఏముందో తేలనుంది. ఇప్పటికే ఆ ప్రాంతాలలో తవ్వకాలు మొదలైనట్లు సింగరేణి సీఎండి బలరాం వెల్లడించారు.

Category

🗞
News

Recommended