• 2 days ago
Minister kollu Ravindra on posani Arrest : వైఎస్సార్సీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలు, ఆదేశాలతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్, నారా లోకేశ్‌ సహా నాటి ప్రతిపక్షంలోని ముఖ్యులు, వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలం, బూతులతో పేట్రేగిపోయిన సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణమురళి పాపం ఎట్టకేలకు పండింది. చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు రోజుల కిందట నమోదైన ఓ కేసులో పోలీసులు బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Category

🗞
News

Recommended