Ind Vs Ban Updates: ఎనిమిదేళ్ల సుదీర్ఘ సమయం తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ బుధవారం వైభవంగా స్టార్ట్ అయ్యింది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్థాన్ తో న్యూజిలాండ్ తలపడుతోంది. రెండో మ్యాచ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. హైబ్రీడ్ మోడల్లో భాగంగా ఈ మ్యాచ్ దుబాయ్ లో జరుగుతోంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి జోరుమీదున్న భారత్.. ఐసీసీ టోర్నీలోనూ అదే ప్రదర్శన చేయాలని భావిస్తోంది. అయితే వేదికతోపాటు పరిస్థితులు విభిన్నం కావడంతో భారత ప్రణాళికలు ఎంతమేరకు ఫలిస్తాయో చూడాలి. ఇక ఈ టోర్నీలో టీమిండియా ఫైనల్ లెవన్ కూర్పుపై మల్లగుల్లాలు పడుతోంది. ఏ ఆటగాడిని రిజర్వ్ కు పరిమితం చేయాలో, ఎవరినీ ఆటగాడించాలనే అనే సందిగ్దత టీమ్ మేనేజ్మెంట్ ను వేధిస్తోంది. దీంతో బంగ్లాకు ముందు భారత్ ప్లేయింగ్ లెవన్ ఎలా ఉండబోతోందోనని అటు అభిమానులతోపాటు ఇటు విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు.
Category
🗞
News