• 2 days ago
NTR Death Anniversary : ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ, రామకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి బాలకృష్ణ, రామకృష్ణ శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం కాసేపు అక్కడే కూర్చొని నటుడిగా, నాయకుడిగా సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.

నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. నందమూరి తారక రామారావు విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచే టీడీపీ పుట్టిందని గుర్తు చేశారు. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారని తెలిపారు. ఎన్టీఆర్‌ అంటే నటనకు నిర్వచనం, నవరసాలకు అలంకారమన్నారు. ఎన్టీఆర్‌ అంటే ఒక వర్సిటీ, జాతికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ లాంటి వారికి మరణం ఉండదని బాలకృష్ణ స్పష్టం చేశారు.

Category

🗞
News
Transcript
00:00Music
00:28Music
00:38Music
00:48Music
00:58Music
01:13Music
01:33Music
01:43Music
01:53Music
02:03Music
02:13Music
02:23Music

Recommended