World Telugu Writers Conference : ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే 14వ భాష తెలుగు అని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. అలాగే దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే నాలుగో భాష తెలుగు అని పేర్కొన్నారు. కవిత్రయం వంటి కవుల కారణంగా తెలుగుకు ప్రాచుర్యం వచ్చిందన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసించారని గుర్తు చేశారు. తెలుగు భాషా.. సంగీతమా.. అని రవీంద్రుడు మెచ్చుకున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా ప్రారంభం కాగా, ఈ సభలో శైలజా కిరణ్ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు.
'రామోజీరావు గారికి తెలుగు భాషన్నా, తెలుగు రాష్ట్రాలన్నా ఎంతో ఇష్టం. ఉదయం ఆయనను పలకరించగానే శుభోదయం అనే చెప్పేవారు. మేమంతా ఇంట్లో ఉదయం శుభోదయం అనే పలకరించుకునేవాళ్లం. రామోజీరావుకు గుర్తుగా ఇకపై మనమంతా శుభోదయం అనే పలకరించుకుందాం. మా ఇంట్లో పిల్లలు తెలుగు మాట్లాడేలా రామోజీరావు గారు శ్రద్ధ తీసుకునే వారు. మనది అని అనుకునే దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. కాపాడుకుంటాం. అలాగే తెలుగు భాష మనందరిది. అందుకే మనమంతా కలిసికట్టుగా మన భాషాభివృద్ధి కోసం కృషి చేద్దాం. ఇది చాలా ముఖ్యమైంది.' అని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పిలుపునిచ్చారు.

Category
🗞
News