• 6 months ago
BRS MLA Kale Yadaiah joined Congress : బీఆర్​ఎస్​కు షాక్​లు మీద షాక్​లు ఇస్తూ కాంగ్రెస్​ పార్టీలోకి చేరికలు రోజు రోజుకీ జోరందుకుంటున్నాయి. తాజాగా బీఆర్​ఎస్​ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్​ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

దీంతో ఇప్పటివరకు ఆరుగురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్​కు ఇప్పటివరకు ఉన్న 65 సభ్యుల బలం సీపీఐతో కలిపి 66కు చేరుకుంది. ఇప్పుడు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ఆరుగురు చేరడంతో 72కి సభ్యుల బలం పెరిగింది. దీంతో శాసనసభలో బీఆర్​ఎస్​కు 32 మంది, బీజేపీకి 8 మంది, ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30You
01:00You

Recommended