తమిళనాడు లోని తంజావూరు జిల్లాలో పేరవూరని నియోజకవర్గం శాసనసభ్యుడు అశోక్ కుమార్ మెుయ్ విందు ఏర్పాటు చేశారు. వంద పొట్టేళ్ళు కొట్టి మంచి మాంసం ఏర్పాటు చేశారు. శాఖాహారులకు, సాంబారు, పాయసం, వడతో పాటుగా వివిధ రకాల వెరైటీలు అందుబాటులో ఉంచారు. దాదాపు 8వేల మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరైన ప్రతి ఒక్కరూ వారి వారి తాహతకు తగినంత చదివింపులు చేశారు. అలా వచ్చినవి లెక్కగడితే... వసూలు ఐంది ఎంతో తెలుసా...15 కోట్ల రూపాయలు.
Category
🗞
News