• 2 years ago
సీఎం జగన్ శుక్రవారం విశాఖలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా.. తన కాన్వాయ్ ఆపి మరీ ఓ కుటుంబం గోడును విన్నారు. పెదవాల్తేరుకు చెందిన ధర్మాల త్రివేణి తన ఇద్దరు బిడ్డలతో వచ్చి సీఎంకు తమ సమస్య చెప్పుకున్నారు. కొద్దిరోజుల క్రితం తన భర్త హత్యకు గురయ్యాడని, ఇద్దరు చిన్న పిల్లలతో కుటుంబ పోషణ భారంగా మారిందని సమస్యను వివరించారు. దీంతో త్రివేణి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ను‌ ఆదేశించారు. సీఎం జగన్. అలాగే, శ్రీకాకుళం జిల్లా కు చెందిన రామారావు కుటుంబం... తమ బిడ్డల అనారోగ్య సమస్యలను సీఎం జగన్ కు తెలియజేశారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి చూసి చలించిన సీఎం.... వారికి అవసరమైన సాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

Category

🗞
News

Recommended