నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం చోటుచేసుకుంది. డ్యామ్‌పై రాకపోకల విషయంలో తెలంగాణ SPF సిబ్బంది, ఏపీ సివిల్ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. జలాశయంపైకి ఏపీ చెందిన ఎస్సై వాహనాన్ని తెలంగాణ SPF అనుమతించలేదు. దీంతో ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ SPF సిబ్బంది వాహనాలకు ఏపీ సివిల్ పోలీసులు చలానా విధించారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో ఇరువర్గాలు శాంతించాయి.
Category
🗞
News