ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వశిష్ఠ వారధి వద్ద..... వశిష్ఠ గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు మరింత పెరిగితే, అది పాత బ్రిడ్జిను తాకే అవకాశముందని అంచనా వేస్తున్నారు. వరద ఉద్ధృతికి అయోధ్య లంక, పుచ్చల లంక, పెద్దమల్లం లంక వంటి పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఆయా గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Category
🗞
News