ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు.. మేడిగడ్డ, సమ్మక్క సాగర్ వరద నీటి ఉద్ధృతి పెరిగింది. వచ్చే రెండు రోజుల్లో గోదావరి డిశ్చార్జి 21 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, పినపాక, మణుగూరు, బూర్గంపాడు, భద్రాచలంలోని అన్ని ప్రభావిత గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Category
🗞
News