Daggubati Rana Attend Court : స్థలం లీజు వివాదంలో కోర్టుకు రానా | ABP Desam

  • 2 years ago
సినీ నటుడు దగ్గుబాటి రానా ఓ స్థలం లీజు వివాదంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. 2014లో ఫిలింనగర్ లోని స్థలాన్ని ఓ సంస్థ లీజుకు తీసుకుంది. అయితే లీజ్ లో ఉన్న భూమిని దగ్గుబాటి సురేష్ తన కుమారుడు రాణా పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని వ్యాపారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే దగ్గుపాటి రాణాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీచేసింది. ఇవాళ జరిగిన విచారణకు రాణా హజరయ్యారు. తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా వేసింది కోర్టు.