నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారుతెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ‘కిల్లింగ్ మెషీన్’ పేరుతో తొలి విజువల్ విడుదల చేశారు.
Category
🗞
News