ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర RRR సృష్టించిన భీభత్సం ఓ రేంజ్ కాదు. హాలీవుడ్ క్రిటిక్స్ కూడా సూపర్బ్ అంటూ మెచ్చుకుంటున్న ఈ సినిమా పై రిలీజ్ నుంచి ఓ కాంట్సవర్సీ నడుస్తోంది. అదే గే లవ్ స్టోరీ. ఎందుకో తెలియదు చాలా మంది క్రిటిక్స్ దీన్ని ఓ గే లవ్ స్టోరీగా చెబుతూ గతంలో ట్వీట్లు చేశారు. మరికొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం ఈ పదాన్ని వాడుతూ ట్రోల్ చేశారు. అయితే రీసెంట్ గా ఫేమస్ సౌండ్ డిజైనర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ రసూల్ పూకుట్టి కూడా RRR ను గే లవ్ స్టోరీ అనటం వివాదానికి కారణమైంది. బాహుబలి ప్రొడ్యూసర్, రాజమౌళికి వన్ ఆఫ్ ది క్లోజ్ అసోసియేట్ అయిన శోభు యార్లగడ్డ రసూల్ పూకుట్టి ట్వీట్ కు స్పందించారు.
Category
🗞
News