• 7 years ago

ఇటీవల మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ ఆత్మ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్‌ సీఐ సదానాగరాజు వెల్లడించారు.
హైదరాబాద్‌ పటాన్‌చెర్వుకు చెందిన నాగారావు, సత్యప్రియ, నర్సింహ అనే ముగ్గురు వ్యక్తుల ఆదివారం ముత్తిరెడ్డికుంటలో ఉన్న ప్రణయ్‌ నివాసాసికి వెళ్లారు. ప్రణయ్‌ ఆత్మ తమతో మాట్లాడుతుం దని, మీతో కూడా మాట్లాడిస్తామని నమ్మబలి కారు.
అనుమానం వచ్చిన ప్రణయ్‌ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించి వారిపై పిర్యాదు చేశారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేయడంతోపాటు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఆత్మ ఉందనే పేరుతో ప్రణయ్‌ కుటుంబ సభ్యులను మోసం చేయడానికి వారు వచ్చారని సీఐ తెలిపారు.
#Amrutha
#Pranay
#Pranay’sSpirit
#maruthirao
#couple

Category

🗞
News

Recommended