• 7 years ago
The makers of Mahesh Babu’s new movie in the direction of Vamsi Paidipally titled as “RISHI”. The filmmakers released every day one word and now the revealed full words and it is RISHI.
#MaheshBabu
#vamshipaidipally
#dilraju
#poojahegde
#RISHI


మహేష్ బాబు కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 25వ చిత్రానికి సంబంధించిన టైటిల్ వినూత్నంగా ఆవిష్కరిస్తున్నారు. రోజుకో అక్షరాన్ని విడుదల చేస్తూ దర్శకుడు వంశీ పైడిపల్లి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పటికే ఆర్, ఐ, ఎస్ అనే అక్షరాలను విడుదల చేయగా... మంగళవారం ఉదయం 'హెచ్', 'ఐ' అనే అక్షరాలను ట్విట్టర్ ద్వారా రివీల్ చేశారు. దీంతో సినిమా టైటిల్ 'రిషి' అని ఖరారైంది. ఈ టైటిల్ పెట్టడం వెనక దర్శకుడు వంశీ పైడిపల్లి చాలా కసరత్తు చేశారు. ముఖ్యంగా ఒక్కో అక్షరంలో అర్థాన్ని వివరించిన తీరు ఆకట్టుకుంటోంది.
మహేష్ బాబు ఇప్పటి వరకు 24 సినిమాలు చేశారు. ఈ సినిమాలతో ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. తన 24 సినిమాలను మించిపోయేలా 25వ మూవీ రీ మార్కబుల్ జర్నీగా ఉండబోతోంది. అందుకే తొలి అక్షరాన్ని ‘ఆర్' అని డిసైడ్ చేశారు.

Recommended