The Supreme Court on Monday adjourned the hearing of petitions challenging the validity of Article 35A, which allows special rights to permanent residents of Jammu and Kashmir.Article 35A was incorporated into the Constitution in 1954 by an order of the then President Rajendra Prasad on the advice of the Jawaharlal Nehru Cabinet.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A చెల్లుబాటుపై వాదనలను సుప్రీంకోర్టు ఆగష్టు 27కు వాయిదా వేసింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయడం జరిగింది. అయితే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్నందున విచారణను వాయిదా వేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. అంతేకాదు ఒకవేళ తీర్పు ప్రతికూలంగా ఉంటే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని కేంద్రం కోర్టుకు తెలిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారణ చేస్తోంది. ముందుగా ఆర్టికల్ 35Aలోని అంశాలు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తాయా లేదా అనే దానిపై చూడాలని జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. ఆ తర్వాతే కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా లేదా అన్నది చెబుతుందని చెప్పారు.
#supremecourt
#article35a
#JammuKashmir
#presidentorder
#JawaharlalNehru

Category
🗞
News