• 6 years ago
The government on Thursday appointed Justice Jitendra Kumar Maheshwari of the Madhya Pradesh High Court as the Chief Justice of Andhra Pradesh.Justice JK Maheshwari is currently a senior judge at the Madhya Pradesh High Court. Justice Maheshwari will be the first Chief Justice of the recently bifurcated Andhra Pradesh High Court. His elevation to this post was proposed by the Supreme Court Collegium in its resolution dated August 22, 2019.
#JusticeJitendraKumarMaheshwari
#ChiefJusticeofAndhraPradesh
#MadhyaPradeshHighCourt
#firstChiefJusticeofap
#AndhraPradeshHighCourt
#SupremeCourtCollegium


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జస్టిస్‌ మహేశ్వరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో నంబర్‌ టూ స్థానంలో ఉన్న జస్టిస్‌ మహేశ్వరిని పదోన్నతిపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫారసు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేయడం తెలిసిందే. దీనికి ప్రధాని మోదీ ఆమోద ముద్ర వేయడంతో జస్టిస్‌ మహేశ్వరి నియామక ఫైలు రాష్ట్రపతికి చేరింది. తాజాగా రాష్ట్రపతి సైతం ఆ నియామకానికి ఆమోదముద్ర వేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీజేగా జస్టిస్‌ మహేశ్వరి నియామకం అమల్లోకి వస్తుందని కేంద్రం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Category

🗞
News

Recommended