• 7 years ago
Trivikram Srinivas has now teamed up with Jr NTR for Aravindha Sametha. On the actor's birthday, the first look of the film was launched and it received an overwhelming response. Now this movie release date was locked on october 10th. In this situation, Its pre release business becomes talk of the industry.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మొదటిసారి రూపొందుతున్న అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ సాఫీగా జరిగిపోతోంది. దసరా రిలీజ్ ముందే ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే షూటింగ్ జరుగుతోంది. విడుదల ఇంతకు ముందు అక్టోబర్ 18న అనుకున్నప్పటికీ కొద్ధి రోజుల క్రితమే రామ్ హలో గురు ప్రేమ కోసమేతో పాటు విశాల్ పందెం కోడి 2ని కూడా అదే డేట్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించేసారు. కాబట్టి వారం ముందుగానే అంటే అక్టోబర్ 11న జూనియర్ ని బాక్స్ ఆఫీస్ బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. ఆగష్టు 15న ప్లాన్ చేసిన టీజర్ విడుదలలో ఈ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Recommended