• 7 years ago
England batsmen’s efforts to work out a gameplan against the bowling of Kuldeep Yadav came to nought as the ace chinaman bowler once again exposed their spin frailties in the first One-day International at Trent Bridge on Thursday.
#kuldeepyadav
#india
#england1stodi
#viratkohli
#indiainengland2018

ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెట్టిన కుల్దీప్‌ యాదవ్‌ ఆరు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
తద్వారా వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతివాటం స్పిన్నర్‌గా కుల్దీప్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఇంగ్లాండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన స్పిన్నర్‌గా కూడా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన కుల్దీప్ కేవలం 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.
అంతేకాదు బ్రిటీష్‌ పిచ్‌లపై వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా కుల్దీప్‌ అరుదైన ఘనత సాధించాడు. ఒక​ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్‌ చైనామన్‌ బౌలర్‌ బ్రాడ్‌ హాగ్‌ రికార్డును తిరగరాశాడు. గతంలో అనిల్‌ కుంబ్లే(6/12), అమిత్‌ మిశ్రా(6/48), మురళీ కార్తీక్‌(6/27)లు ఈ ఘనత సాధించారు.

Category

🥇
Sports

Recommended