ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి రాజీనామా

  • 6 years ago
Former Minister Danam Nageder met TRS leader and Minister Talasani Srinivas Yadav after his resignation to Congress.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార పార్టీలో చేరిపోయారు. ఇటీవల మరో సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో తీవ్ర భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి.
రేవంత్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డిల చేరికపైనా పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నాగం చేరికతోనే దామోదర్ రెడ్డి పార్టీని వీడాల్సి వచ్చిందని డీకే అరుణ స్పష్టం చేశారు కూడా. తాజాగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ రాజీనామా కాంగ్రెస్ పార్టీతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా సమీక్షించుకొనే వ్యవహారాన్ని కాంగ్రెస్‌ చేపట్టింది. పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించేందుకు సీఎల్పీ నేత జానా రెడ్డి నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, వీహెచ్‌ హనుమంతరావు, షబ్బీర్‌ అలీ, తదితరులు భేటీ అయ్యారు.
ఇంకా ఎవరెవరు పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నారనే అంశంతో పాటు చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలు, పార్టీ బలోపేతం, క్యాడర్‌లో విశ్వాసం ఎలా నింపాలనే దానిపై జానా రెడ్డి నివాసంలో కీలకంగా చర్చించినట్టు సమాచారం. వీలైతే పార్టీని వీడకుండా కీలక నేతలను ఆపాలనే ప్రయత్నాలు సాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.