పవన్ పై ధ్వజం ఎత్తిన గిడ్డి ఈశ్వరి

  • 6 years ago
Telugudesam Party leader and MLA Giddi Eswari on Thursday fired at Jana Sena chief Pawan Kalyan for his Paderu tour.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. పవన్ విశాఖలో పర్యటిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆమె తీవ్రంగా స్పందించారు.
మన్యంలో ఎలాంటి తవ్వకాలు జరగడం లేదని గిడ్డి ఈశ్వరి అన్నారు. పవన్ కళ్యాణ్‌కు సినీ రంగంలో అనుభవం ఉంటే ఉండొచ్చు కానీ, రాజకీయ రంగంలో మాత్రం పరిపక్వత సాధించలేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లో హిట్స్ కొట్టలేకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ సినిమా నటుడు కాబట్టి ఆయనను చూసేందుకు చాలామంది జనాలు వస్తున్నారని గిడ్డి ఈశ్వరి చెప్పారు. అంతే తప్ప రాజకీయంగా ఆయనను సమర్థించేందుకు కాదని అభిప్రాయపడ్డారు. పవన్‌కు రాజకీయ పరిపక్వత ఏమాత్రం లేదన్నారు. పవన్ వేసవి విడిదికి విశాఖ వచ్చి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏమిటన్నారు.
2014 అనంతరం విశాఖ మన్యం అభివృద్ధి చెందిన విషయాన్ని పవన్ కళ్యాణ్ మొదట తెలుసుకోవాలని ఈశ్వరి హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీలపై పవన్‌కు ప్రేమలేదన్నారు. పాడేరులో సభ ఏర్పాటు చేసిన ఆయన, పక్కనే ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు పూలమాల కూడా వేయకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. మన్యంపై అవగాహన లేని గిరిజనుల గురించి మాట్లాడటం విచారకరం అన్నారు.

Category

🗞
News

Recommended