pawan Kalyan's kushi Movie Celebrates 17 Years Of its Release

  • 6 years ago
AM Ratnam meets Pawan Kalyan at Janasena Party office. Kushi movie completes 17 years
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఖుషి తిరుగులేని చిత్రం. టాలీవుడ్ లో ఖుషి తరువాత అనేక ప్రేమ కథలు, రొమాంటిక్ చిత్రాలు వచ్చి ఉండవచ్చు. కానీ ఖుషి చిత్ర స్థానం మాత్రం ఎప్పుడూ ప్రత్యకంగానే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి సూపర్ ఫామ్ లో ఉన్నరోజుల్లోనే ఖుషి చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసి పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. భూమిక, పవన్ కళ్యాణ్ మధ్య సరదాగా సాగె సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ స్టయిల్, అలీతో కామెడీ సీన్స్ ఈ చిత్రాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. అప్పట్లో యువతని ఈ చిత్రం ఉర్రూతలూగించింది. ఈ చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఖుషి చిత్రం విడుదలై 17 ఏళ్ళు గడచిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ ని జనసేనపార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు ఆయన భారీ పుష్ప గుచ్చం అందజేశారు. ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించగా, తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్, ఏ ఎం రత్నం ఏకాంతంగా ఖుషి చిత్ర అనుభవాలని నెమరు వేసుకున్నారు.
ఖుషి చిత్రం విడులయ్యాక ఉమ్మడి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోయింది. తిరుగులేని స్టార్ గా టాలీవుడ్ ని ఏలుతున్న చిరంజీవి ఆ సదర్భంగాలో ఓ మాట అన్నారు. 'తమ్ముడి జోరు చూస్తుంటే.. ఇక నేను కూడా జాగ్రత్త పడాలి అనిపిస్తుంది'.. చిరు నోట అలాంటి మాట వచ్చిందంటే పవన్ జోరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
#Pawan Kalyan
#AM Ratnam
#bhumika chawla

Recommended