పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు బాబు, కాంగ్రెస్‌ను కలవడంపై సందిగ్ధం!

  • 6 years ago
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu reachs New Delhi, to meet opposition leaders.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంటలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ఆయన కాసేపట్లో పార్లమెంటు సెంట్రల్ హాలుకు వెళ్లనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో విపక్ష నేతలను కలవనున్నారు. ప్రత్యేక హోదా, సభలో అవిశ్వాసానికి మద్దతు కోరనున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్టు మినహా ఇతర నాయకులను ఆయన కలవనున్నారు. బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని చెప్పి, వారి సహకారం కోరనున్నారు. ప్రత్యేక హోదా, అవిశ్వాస తీర్మానం విషయంలో ఆయన ఏ మేరకు ఫలప్రదం అవుతారనేది ఆసక్తికరమే. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలను కూడా కలవనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.
కాగా, అంతకుముందు రోజు సోమవారం సాయంత్రం ఉండవల్లిలోని ప్రజా దర్బార్ హాలులో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడమే లక్ష్యంగా తాను ఢిల్లీ పర్యటన అని, అంతే తప్ప రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచన, ఆసక్తి తనకు లేదన్నారు. గతంలో రెండుసార్లు ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం వచ్చినా తాను సున్నితంగా తిరస్కరించానన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై మండిపడ్డారు. మంగళ, బుధవారాల్లో ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి సారిస్తానని, ఢిల్లీలోనే కాకుండా రాష్ట్రం యావత్తు తన పర్యటనపై అంచనాలు ఉన్నాయని, ఎన్నికలంటే భయంతో వైసీపీ పార్లమెంటు సమావేశాల చివరి రోజున రాజీనామాలు ప్రకటించిందన్నారు. రాజకీయాలకు కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చూపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాకు విజ్ఞప్తి చేశారు

Category

🗞
News

Recommended