బాబు పై మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు

  • 6 years ago
Telugudesam Party senior leader Mothkupalli Narsimhulu lashed out at Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu in Revanth Reddy issue, he may join TRS.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో షాక్ మీద షాక్ తగులుతుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆయనపై శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోత్కుపల్లి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. రెండు రోజులుగా ఆయన అధినేతపై విమర్శలు చేస్తున్నారు.
దీంతో మోత్కుపల్లి టీడీపీని వీడి టీఆర్ఎస్‌లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. తనకు చంద్రబాబు అపాయింటుమెంట్ ఇవ్వలేదని ఆయన వాపోయారు. తనను ఒకలా, కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని మరోలా చూశారని అభిప్రాయపడ్డారు. దళితులకు విలువ లేదని, తెలంగాణలో చంద్రబాబు మాటకు విలువ ఎక్కడిదని మండిపడ్డారు.
తాను కలుస్తానంటే చంద్రబాబు అపాయింటుమెంట్ ఇవ్వలేదని మోత్కుపల్లి చెప్పారు. దీనిని తాను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నానని చెప్పారు. మాల, మాదిగలకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చంద్రబాబు, అంబేడ్కర్ విగ్రహం పెడతానంటే ఎలా నమ్ముతామని ఆయన ప్రశ్నించారు. తమకు తెలుగుదేశం పార్టీలో గౌరవం లేకుండా పోయిందన్నారు. కేసీఆర్‌కు కితాబు, చంద్రబాబు ఎందుకు చేయట్లేదు అదే సమయంలో మోత్కుపల్లి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ప్రశంసలు కురిపించారు. ఎస్సీ వర్గీకరణకు కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు ఎందుకు చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ తెలంగాణలో డబ్బులు లేని వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చారని చెప్పారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే పరిస్థితి నెలకొన్నదని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో చంద్రబాబు మాటకు విలువ లేదని అభిప్రాయపడ్డారు.