మిట్ట మధ్యాహ్నమే చిమ్మచీకట్లు, ఈదురుగాలులతో హైదరాబాద్‌లో వర్షం

  • 6 years ago
హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లుంబినీ పార్క్, హిమయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురిసింది.

మధ్యాహ్నం మూడున్నర గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. పట్టపగలే రాత్రిలా కనిపించింది. ఓ వైపు ఈదురు గాలులు, మరోవైపు, చిమ్మ చీకట్లు, ఇంకోవైపు వర్షం. వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.

Recommended