ఎనిమీస్...పాక్ ప్రజల ముందే రాజమౌళి సంచలనం

  • 6 years ago
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లింది. భారతీయ సినిమా చరిత్రలో రూ. 1000 కోట్ల మార్కును అందుకున్న తొలి చిత్రంగా రికార్డుల కెక్కిన ఈ చిత్రం ఇంటర్నేషనల్ రేంజికి భారతీయ సినిమా ఖ్యాతిని విస్తరించేలా చేసింది. ఈ చిత్రం వివిధ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింతం కావడంతో రాజమౌళి ఆయా దేశాలు పర్యటించారు. తాజాగా బాహుబలి 'పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌'లో ప్రదర్శితం అవుతోంది. ఫెస్ట్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు జక్కన్న కరాచీ వెళ్లారు.

Recommended