• 8 years ago
Baahubali Director SS Rajamouli's multi starrer movie with NTR, Ram Charan is gone like anything in social media. For this high action movie, Rajamouli father Vijayendra prasad penning the story. As per the reports, This movie is going to shoot with 150 crores budget.

దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రం రాబోతున్నదనే వార్త టాలీవుడ్‌నే కాదు.. ఇతర సినీ పరిశ్రమలను కూడా కుదిపేసింది. తాజాగా ఈ వీరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమింటంటే..
ఎన్టీఆర్, రాంచరణ్‌తో రాజమౌళి తీయబోయే చిత్రానికి సంబంధించిన కథపై ఇప్పటికే కథా రచయిత, జక్కన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కసరత్తు చేస్తున్నారనేది తాజా సమాచారం.
విజయేంద్ర ప్రసాద్ రూపొందించనున్న కథ చాలా పవర్‌పుల్‌గా ఉంటుంది అని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎమోషనల్ సీన్స్‌ను, యాక్షన్ కథతో రూపొందించబోయే చిత్రంలో భారీ తారాగణం ఉంటుందట.
ఎన్టీఆర్, రాంచరణ్ ఇమేజ్, అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఎవరి పాత్రకు ఏ మాత్రం ప్రధాన్యం తగ్గకుండా కథాపరంగా చర్యలు తీసుకొంటున్నారట.
ఇక ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.150 కోట్లకుపైగానే అనే మాట వినిపిస్తున్నది. బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్ర కావడంతో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. ఫ్యాన్స్, ప్రేక్షకుల అంచనాలకు తగ్గినట్టే సినిమాను తెరకెక్కించే ఉద్దేశంతో జక్కన్న ప్రిపేర్ అవుతున్నాడట.
ఈ ప్రాజెక్ట్‌కు ముందు రాంచరణ్, ఎన్టీఆర్‌కు వేరే దర్శకులతో కమిట్‌మెంట్ ఉంది. బోయపాటి శ్రీనుతో రాంచరణ్ ఓ మాస్ సినిమా చేయనున్నాడు.
అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ యాక్షన్‌తో కూడిన ఓ కుటుంబ కథా చిత్రంలో నటించనున్నారు.

Recommended