• 7 years ago
After huge success of Arjun Reddy, Vijay Devarakonda's latest movie is Ye Mantram Vesave. Presented By : Malkapuram Sivakumar and Directed by Sridhar Marri. This movie set to release on March 9th. In this occassion, Producer Siva kumar speaks to media.

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ యువతలో మోస్ట్ క్రేజీయస్ట్ హీరోగా మారాడు. ఇక ఈ యువహీరో నటిస్తున్న తాజా చిత్రం 'ఏ మంత్రం వేశావే'. విజయ్ సరసన శివానీసింగ్ నాయికగా నటిస్తుంది.
గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మార్చి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా సమర్పకుడు మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ గేమ్ నేపథ్యంలో నడిచే విభిన్నమైన కథ ఇది. విజయ్ దేవరకొండ పాత్ర ఇందులో చాలా వైవిధ్యంగా, నేటి యువతరానికి ప్రతినిథిగా కనిపించబోతున్నాడు అని తెలిపారు.
పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి తరహాలోనే ఈ చిత్రం కూడా ఆయన కెరీర్‌లో మరపురాని చిత్రంగా వుండబోతుంది. విదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా వుంటాయి. మార్చి 9న చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలిపారు.
విజయ్ దేవరకొండ, శివానీసింగ్‌తోపాటు శివన్నారాయణ, రాజబాబు, నీలాక్షిసింగ్, ఆశిష్‌రాజ్, ప్రభావతి, దీపక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అబ్భత్ సమత్, సినిమాటోగ్రఫీ: శివారెడ్డి.

Recommended