• 7 years ago
In Vijayawada Kanakadurga temple, it is confirmed that the conducting of Tantric Poojas is a reality. Firstly, the suspicions on secret poojas were strengthened when the EO change her word about unknown person in cc footage. Now that the CC camera footage is creating a lot of doubts.
Vijayawada Kanakadurga Temple EO Surya Kumari speaking to media over Tantric Pooja that took place at Mid-Night on 26 December condemned the rumours.

బెజవాడ కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆలయ ముఖ్య అధికారి ఒకరు దానికి నడుం కట్టినట్లు తెలుస్తోంది.

భైరవీ పూజ చేస్తే మరింత శక్తి వస్తుందని, కష్టాలు తొలుగుతాయని ఓ అర్చకుడు ముఖ్య అదికారికి చెప్పారని సమాచారం. ఈ మేరకు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి. దానికి ముఖ్య అధికారి తల ఊపి తమిళనాడు నుంచి తాంత్రికులను పిలిపించినట్లు తెలుస్తోంది.మీడియా కథనాల ప్రకారం- డిసెంబరు 26వ తేదీ రాత్రి 9 గంటలకు గట్టువెనుక నివాసం ఉంటున్న ఆలయ అర్చకుడి ఇంటికి ఆ అధికారి వెళ్లారు. ఆలయంలో భైరవీ పూజను ఎలా పూర్తి చేయాలనే విషయంపై వారిద్దరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తంతుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు.

తమిళనాడు నుంచి వచ్చిన నలుగురు తాంత్రికులతోపాటు దుర్గమ్మ ఆలయంలో పూజలు చేసే తండ్రీ కొడుకులు గుడిలోకి చేరుకున్నారని సమాచారం. అమ్మవారికి పవళింపు సేవ ముగిసిన తర్వాత మూసివేసిన గర్భగుడి తలుపులను తెరిచారని, రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 12.45 గంటల వరకు అత్యంత రహస్యంగా భైరవీ పూజ నిర్వహించారని అంటున్నారు. తంతు ముగిసిన తర్వాత గుడి తలుపులు మూసి వెళ్లిపోయారని సమాచారం.

Category

🗞
News

Recommended