సూర్య, సాయిపల్లవి రొమాన్స్..

  • 6 years ago
Gajini, Singam Suriya, Fidaa,MCA fame Sai Pallavi pairing up for a film in '7G Brindavana Colony','Aadavari Matalaki Ardhale Verule' Director Selva Raghavan's Direction. This film is being bankrolled by S.R.Prabhu, S.R.Prakash Babu under Dream Warrior Pictures banner who recently delivered a Hit with 'Khaakee'. Pooja of this new film was held on Monday (Jan 1st). Senior Hero Siva Kumar, Suriya, Karthi attended the launch.
'గజిని', 'సింగం' చిత్రాల హీరో సూర్య, 'ఫిదా', 'ఎంసిఎ' చిత్రాల హీరోయిన్‌ సాయిపల్లవి జంటగా సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఎస్‌.ఆర్‌.ప్రభు, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబుల కొత్త చిత్రం షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. సీనియర్‌ హీరో శివకుమార్‌, సూర్య, కార్తీ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ ''నా గత 35 చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. సెల్వ రాఘవన్‌ చెప్పిన సబ్జెక్ట్‌ చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. కమర్షియల్‌ వేల్యూస్‌ ఉంటూ అందర్నీ ఆకట్టుకునే చిత్రమిది. ఇందులో హీరోయిన్‌ సాయిపల్లవి క్యారెక్టర్‌కి కూడా మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుంది'' అన్నారు.
దర్శకుడు సెల్వ రాఘవన్‌ మాట్లాడుతూ ''సూర్య లాంటి విలక్షణమైన హీరోతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కథకు సూర్య ఒక్కరే యాప్ట్‌ అని సినిమా చూశాక మీకే తెలుస్తుంది. అంతకుమించి ఏమిచెప్పినా బాగుండదు'' అన్నారు.

Recommended