Ravi Teja's next film Touch Chesi Chudu is in final stages of the shoot and the makers announced that the film will hit the screens on January 13th, 2018. Vikram Sirikonda is the director and Rashi Khanna is the female lead.
సంక్రాంతి వచ్చిందంటే తెలుగు సినిమా బాక్సాఫీసు వద్ద సందడే సందడి. టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ కురిపించే సీజన్ ఇది. ఈ సీజన్లో తమ సినిమా విడుదల చేయాలని ప్రతి స్టార్ కోరుకుంటాడు. ఎప్పటిలాగే రాబోయే సంక్రాంతి సీజన్లో కూడా పలువురు టాప్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, తమిళ హీరో సూర్య మాత్రమే ఉన్నారు. తాజాగా రవితేజ కూడా సంక్రాంతి బరిలో దూకేందుకు సిద్దంగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
రవితేజ హీరోగా రూపొందుతున్న ‘టచ్ చేసి చూడు' చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
టచ్ చేసి చూడు' ఫస్ట్ లుక్ పోస్టర్స్ చాలా రోజుల క్రితమే విడుదలయ్యాయి. ఇంతకాలం చడీ చప్పుడు లేకుండా ఉన్న ఈ చిత్రం తాజాగా హాట్ టాపిక్ అయింది. మరో నెల రోజుల సమయం ఉండటంతో టీజర్, ట్రైలర్, ఆడియో ఫంక్షన్ లాంటివి నిర్వహించి ప్రచారం హోరెత్తించనున్నట్లు తెలుస్తోంది.

Category
🎥
Short film