Skip to playerSkip to main contentSkip to footer
  • 11/6/2017
Samantha Ruth Prabhu cooks up a delicious meal for Naga Chaitanya after her shoot gets cancelled.
పెళ్లికి ముందు నాగచైతన్య వంట చేస్తున్న ఫొటోలను షేర్ చేసిన సమంత, పెళ్లి తర్వాత గృహిణిగా వంట చేయడం గురించి ఫస్ట్ టైమ్ ఇలా పోస్ట్ చేశారు. అందుకే అంటారు పెళ్లి తర్వాత మార్పులు అవంతట అవే వస్తాయని. ఏమైతేనేం సమంత వంట చేసింది. ఎవరికీ ఏం కాలేదు. అంతా సేఫ్ అట.
వివాహానంతరం సమంత తొలిసారి వంటగదిలోకి వెళ్లి వంట చేసి గృహిణి బాధ్యతలు నెరవేర్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా 'వంట చేశానోచ్...ఎవరూ చావలేదోచ్' అంటూ సంబరపడిపోయింది.
షూటింగ్ క్యాన్సిల్ కావడంతో వంటగదిలోకి వెళ్లానని, కూరగాయలు కత్తిరించడం దగ్గర్నుంచి వంట చేయడం వరకు అన్ని పనులు తానే చేశానని సమంత తెలిపింది. ఇకపై ఖాళీ దొరికితే వంటలు చేయడం నేర్చుకుంటానని చెప్పింది. వివాహానంతరం బంధువుల కుటుంబాల్లో భోజనాల సందర్భంగా ఆ గృహిణు బాధ్యతలు చూసి ఆశ్చర్యపోయానని సమంత తెలిపిన సంగతి తెలిసిందే.

Recommended