• 2 days ago
Snake in Washing Machine: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వాషింగ్​ మిషన్​లో పాము చూసి షాపు యజమాని ఉలిక్కిపడ్డాడు. ఓ వ్యక్తి మరమ్మతుల చేయమని వాషింగ్​ మిషన్​ను ఇచ్చివెళ్లాడు. వాషింగ్ మిషన్​ను రిపేర్ చేసేందుకు ఓపెన్ చేసిన షాపు యజమానికి ఒక్కసారిగా తాచుపాము దర్శనం ఇచ్చింది. దీంతో వెంటనే అతను స్నేక్ క్యాచర్​కు సమాచారం ఇచ్చాడు. షాపు వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్ వాషింగ్ మిషన్ కింద భాగంలో చుట్టుకుని ఉన్న తాచుపామును బయటకు తీసి, ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు. అనంతరం ఆ పాముని అటవీ ప్రాంతంలో వదిలేస్తానని స్నేక్ క్యాచర్ తెలిపాడు.

Category

🗞
News

Recommended