97 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్‌లో టీం ఇండియా అరుదైన రికార్డ్ బద్దలుకొట్టింది. టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్ లో ఒకే ఒక సోలిటరీ బౌలర్ తో బరిలోకి దిగి 97 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సోలిటరీ బౌలర్ అంటే మ్యాచ్ లో ఇతర ఫాస్ట్ బౌలర్లు లేకుండా ఆడే ఒకే ఒక బౌలర్‌ను సోలిటరీ ఫాస్ట్ బౌలర్ అని అంటారు. 97 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్‌లో, ఇండియా సెమీస్, ICC ఈవెంట్, ఫైనల్‌లో ఇలాంటి కాంబినేషన్‌ను ఫీల్డింగ్ చేయడం ఇదే మొదటిసారి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పరిస్థితుల వల్ల హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ లేకుండా టీం ఇండియా ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ షమీతో ముందుకు వెళ్ళింది. ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందే తన జట్టును ప్రకటించిన భారత్ ప్రధానంగా స్పిన్నర్లపైనే దృష్టి సారించింది. దుబాయ్ పరిస్థితులకు అనుగుణంగా స్పిన్ పిచ్ లకు అనుగుణంగా టీమ్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది టీమిండియా
Category
🗞
News